Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 11:30 am Posted by : ramakrishna

నిజాంసాగర్ కు భారీ ఇన్ ఫ్లో

నిజాంసాగర్,బతుకమ్మ : ఉమ్మడి జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ఎగువన ఉన్న సింగూర్ డ్యాం నుంచి 43,176 క్యూసెక్కుల  నీటి విడుదల కొనసాగుతోంది. సింగూర్ ప్రాజెక్టు కు 24,718 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ఐదు స్పీల్ వే గేట్స్ ను 1.5 మీటర్స్ పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టుకు 19,500 క్యూసెక్కుల వరద వస్తుంది. మంజీర నది పైభాగం నుంచి వస్తున్న వరదతో నీటి ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో 17.802 టీఎంసీలకు గాను7.804 టీఎంసీల నీటి నిల్వ ఉంది.. మంజీర పై భాగంలో భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు నుంచి వరద పెరుగుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం అంతకంతకు పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి నీటిని విడుదల చేయడం లేదని అధికారులు ప్రకటించారు.