Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 12:38 pm Posted by : ramakrishna

గోవిందరాజ స్వామివారి ఆలయంలో భారీ గోల్ మాల్!

తిరుపతి, బతుకమ్మ:  తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపుర పనుల్లో భారీ స్థాయిలో గోల్ మాల్ జరిగిందన్నఆరోపణలు వినిపిస్తున్నాయి.  నిబంధనల ప్రకారం గోపురానికి తొమ్మిది పొరల స్వర్ణ తాపడం చేయాల్సి ఉండగా, కేవలం రెండు పొరలతోనే పని కానిచ్చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ క్రమంలో దాదాపు 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.  స్వర్ణ తాపడం పనులు జరుగుతున్న క్రమంలో అత్యంత అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల గోపురంపై ఉన్న సుమారు 30 పురాతన విగ్రహాలు దెబ్బతిన్నాయని సమాచారం.