Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 2:14 pm Posted by : ramakrishna

అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా భారీ పేలుడు

 

. . . మూడు కార్లు బైక్ దహనం

. . . దేవుని పల్లి లో ఘటన

 కామారెడ్డి, బతుకమ్మ:

కామారెడ్డి పట్టణం దేవుని పల్లి ప్రాంతంలో శనివారం  ఒక షెడ్ లో కారులో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. స్థానికుల కథనం ప్రకారం.. కారులోకి డొమెస్టిక్ సిలిండర్ నుంచి గ్యాస్ ను నింపుతుండగ జరిగిన పేలుడు ధాటికి భారీ శబ్దం వచ్చి దట్టమైన పొగలు చూట్టు పక్కన వ్యాపించాయి. ఈఘటనలో గ్యాస్ నింపుతున్న కార్ తో పాటు మరో రెండు కార్లు , ఒక బైక్ దగ్ధమయ్యాయి. క్షణాల వ్యవధిలో జరిగిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి వచ్చిన శబ్ధంతో స్థానికులు ప్రాణాలు అరచేత పెట్టుకొని పరుగులు తీశారు. కొందరు స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో పైరింజన్ వచ్చి మంటలను ఆర్పేసింది. సకాలంలో పైరింజన్ లు వచ్చి మంటలు ఆర్పడం అవి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేశారు, దేశంలో గ్యాస్ కొరత కొనసాగుతుంది. ఇంటి అవసరాల కొరకు గ్యాస్ సిలిండర్ ( బుడ్డి)ని బుక్ చేస్తే 25 రోజుల నుంచి 40 రోజుల వరకు దొరికే పరిస్థితి లేదు. కానీ అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ చేసుకునే వారికి మాత్రం గ్యాస్ బండలు సులువుగానే దొరుకుతున్నాయి. ఇల్లీగల్ గా గ్యాస్ ను కార్లలో నింపుతున్న షేడ్ యజమాని తో పాటు, గ్యాస్ ఎజేన్సి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Huge explosion during illegal gas filling