హైదరాబాద్ అడ్డాగా భారీగా డ్రగ్స్ రాకెట్!

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు ఛేదించారు. ఓ రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదకద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసి, సుమారు రూ.12,000 కోట్ల విలువైన ఎండీ (మెఫెడ్రోన్) డ్రగ్‌ను, ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన మీరా-భయందర్, వసాయి-విరార్  పోలీసులు కొన్నాళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో తమ గూఢచారు లను రంగంలోకి దించి వారాల...