Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2024, 5:53 pm Posted by : ramakrishna

జాతరకు భారీ బందోబస్తు

భక్తులు పోలీసులకు సహకరించాలి

భీమ్ గల్, బతుకమ్మ : దక్షణ బద్రి శ్రీ లింబాద్రి గుట్ట లక్ష్మి నర్సింహాస్వామి జాతరను పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును నిర్వహించనున్నట్లు భీమ్ గల్ సీఐ పులిగిల్లా నవీన్ తెలిపారు. బుధవారం లింబాద్రి గుట్ట జాతర సందర్బంగా బందోబస్తూ ఏర్పాటులో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై మహేష్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా జాతరకు వచ్చే భక్తులకు పోలీస్ శాఖ తరపున స్వాగతం సుస్వాగతం తెలిపారు. జాతర సందర్బంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా భారీ బందోబస్తూ ఏర్పాటులో భాగంగా 300 మంది పోలీసులతో, ఆరుగురు సిఐలు, 12 మంది ఎస్సై లతో బందోబస్తూ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా భక్తులకు పోలీసులు జాతర స్థలంలో అందుబాటులో ఉండేందుకు గాను ఆరు అవుట్ పోస్టులను ఏర్పాటు చెస్తున్నట్లు, ఆఖతాయిల ఆటలు కట్టించేందుగాను మాఫ్టిలో షీ టీం పోలీసు బృందలను, ఐదు పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతర నిర్వహణ స్థలంలో అంతటా సీ సీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీఐ వివరించారు. గుట్ట పైన గాని గుట్ట కిందగాని ఎవరైనా అనుమానస్పదంగా, అపరిచితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జాతరకు వచ్చే భక్తులు విలువైన వస్తువులను వెంట తీసుకురావద్దని, దర్శనానికి వచ్చే భక్తులు ఓపికగా వ్యవహరించాలని కోరారు. ఈ నెల 14 నుండి 17 తేదీ వరకు గుట్ట పైకి వాహనాలను అనుమతించబడవని తెలిపారు. వాహనాలను అందరు కేటాయించిన సిస్టమిటిక్ పార్కింగ్ ప్లేస్ లోనే నిలుపలని సీఐ కోరారు.గుట్ట పైన గాని కింద గాని షాప్ ల నిర్వాహకులు భక్తులకు ఆటంకం కలుగకుండా లోలోపలే షాప్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఏదైనా విలువైన సమాచారం ఉంటే సీఐ భీమ్ గల్ 8712659865, ఎస్సై 8712659866 లేదా డైల్ 100కు సమాచారం ఇచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని సీఐ భక్తులను కోరారు.