మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలి

భిక్కనూరు, బతుకమ్మ: మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని జంగంపల్లి లో జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద చెరువులో మంగళవారం ఎమ్మెల్యే చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్య సహకార సంఘాలకు 57,740 చేప పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి మాట్లాడుతూ.. మత్స్యకారులకు ఈ సంవత్సరం కట్ల చేప, రవాట, మీరుగం రకాల చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్  డిపార్ట్...