Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2024, 1:20 pm Posted by : ramakrishna

మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలి

భిక్కనూరు, బతుకమ్మ: మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని జంగంపల్లి లో జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద చెరువులో మంగళవారం ఎమ్మెల్యే చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్య సహకార సంఘాలకు 57,740 చేప పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి మాట్లాడుతూ.. మత్స్యకారులకు ఈ సంవత్సరం కట్ల చేప, రవాట, మీరుగం రకాల చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్  డిపార్ట్ మెంట్ అధికారి దేవీసింగ్, మండల ఇన్ చార్జి జై రామ్ ఫిషర్ మెన్ దశరథం, ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్, మత్స్యకార సంఘం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.