రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీకి హెచ్ ఆర్సీ నోటీసులు
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో సంచలనం రేపిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్ కౌంటర్ పై మానవహక్కుల కమిషన్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ పోలీసు కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆత్మరక్షణార్థం కాల్పులు జరుపడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసి ఘటనుకు దారి...