Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 7:33 pm Posted by : ramakrishna

రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీకి హెచ్ ఆర్సీ నోటీసులు

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో సంచలనం రేపిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్ కౌంటర్ పై మానవహక్కుల కమిషన్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ పోలీసు కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆత్మరక్షణార్థం కాల్పులు జరుపడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసి ఘటనుకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారా? కమిషన్ కు నివేదించాలని డీజీపీని ఆదేశించింది. నవంబర్ 24లోగా పోస్టుమార్టం నివేదికతో సహా ఇతర ఆధారాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.