Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 March 2025, 12:08 pm Posted by : ramakrishna

రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారిలా..

నిజామాబాద్, బతుకమ్మ: ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్లను కరీంనగర్ లో లెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఫలితం ఎప్పుడైనా మారొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. ఏ అభ్యర్థికి కూడా నిర్దిష్ట కోటా ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇందులో భాగంగా పోటీలో ఉన్న మొత్తం 54 మంది అభ్యర్థుల్లో  అత్యల్ప ఓట్లు సాధించిన అభ్యర్థిని ముందుగా ఎలిమినేట్ చేస్తారు. ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో  రెండో ప్రాధాన్యత ఓట్లు ఏ ఏ అభ్యర్థుల కైతే వచ్చాయో ఆ అభ్యర్థులకు ఆ ఓట్లను కలుపుతారు. దీంతో అత్యల్ప ఓట్లు సాధించిన అభ్యర్థి ఎలిమినేట్ అవుతారు. ఇలా అవరోహణ క్రమంలో తక్కువ ఓట్లు ఉన్న అభ్యర్థులందరి ఎలిమినేషన్ జరుగుతుంది.  నిర్దిష్ట కోట ఓట్లను చేరేవరకు ఇదే ప్రక్రియ కొనసాగుతుంది.