Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2024, 4:10 pm Posted by : ramakrishna

నాడు వ్యతిరేకించి నేడు ఎలా..

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, బతుకమ్మ : నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ మాట్లాడిన  వీడియోను అధికారులకు చూపించి ఇప్పుడు ఎలా రేవంత్ రెడ్డి సర్వె చేపడుతున్నారని బాల్కొండ  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసానికి సోమవారం కులగణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు అంతస్తులు వాహనాలు తదితర స్థిర చర ఆస్తుల ల వివరాలు ఎలా సేకరిస్తారని ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు. తనకు వివరాలు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కానీ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే ను తప్పు అంటూ వివరాలు సేకరించడానికి అడ్డమైన వాళ్ళను ఇంటికి పంపిస్తారా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పిన తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గడువులోపు సర్వే పూర్తీ చేయాలనే ఆతృతలో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, పేద బడుగు బలహీనర్గాలతో పాటు మైనారిటీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా సర్వే ద్వారా ప్రజలకు సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని సూచించారు. సర్వే పేరిట,టివి ఫ్రిడ్జ్,స్కూటర్ లాంటి సాధారణ అంశాలను పరిగణలోకి తీసుకుని సంక్షేమ పథకాలు ప్రజలకు ఎగ్గొట్టే ప్రయత్నం జరిగితే  బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని ఎమ్మెల్యే అన్నారు.

How today against the day..