యూరియా కొరత అధిగమించేది ఎలా..?
రోడ్డెక్కుతున్న అన్నదాతలు ఆదిలోనే రైతులకు ఎరువుల కష్టాలు నిజామాబాద్, బతుకమ్మ : ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతులకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. వానా కాలంలో పంటలు వేయకముందే యూరియా కొరత నేపథ్యంలో రోడ్డెక్కుతున్నారు. ఈ నెల 1న గాంధారి మండల కేంద్రంలో రైతులు యూరియా కొరత విషయంలో రాస్తారోకో చేశారు. మంగళవారం ఆర్మూర్ సహకార సంఘం వద్ద రైతులకు సరిపడ ఎరువులు లేకపోవడంతో సొసైటీ ఎదురుగా బైటాయించి నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటలు పండించే సమయంలో అవసరమైన ఎరువులు లేకపోవడంతో...