- కరెంటు కష్టాలు తీరేది ఎప్పుడో..?
- నిత్యం కరెంటు కోతతో ప్రజల అసహనం వ్యక్తం
- కరెంటు కష్టాలను నుండి విముక్తి చెందేదెప్పుడు.?
- వీధి దీపాలతో నెట్టుకొస్తున్న.. పట్టించుకోని ప్రభుత్వం
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోన నిత్యం కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి ఇలాంటి కష్టాలకు లోనవుతున్నామని పేర్కొన్నారు. కరెంటు కోతలతో చిమ్మ చీకటిలో గృహిణులు పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని, బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని అన్నారు. ఇలాగే ఉంటే దొంగల భయం ఉన్న నేపథ్యంలో ఎలా ఉండాలనే దృక్పథంతో ఆందోళన చెందుతున్నారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం లో కరెంటు కోతలు ఎలాంటి నిబంధన లేకుండా ప్రజలకు సౌకర్యం కలిగేలా ఉండేదని అన్నారు.గత కొన్ని రోజులుగా కరెంటు కోతలు విద్యుత్తు గ్రామాలలో విధి దీపాలు లేకుండా కనీస సౌకర్యలు ,నీళ్లు లేక నాన్న తంటాలు పడుతున్నామని ప్రజలు విద్యుత్ శాఖ పైన ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. దీనిని సంబంధిత విద్యుత్ అధికారుల, పై అధికారులు, ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నారు. సంబంధిత ఏఈ,పై అధికారులు స్పందించి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలుపుతున్నారు.