. ఎమ్మెల్యేలు పార్టీ మారి 10 నెలలైంది
. ‘అనర్హత’ పిటిషన్ విచారణ 18కి వాయిదా
న్యూఢిల్లీ, బతుకమ్మ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ పై విచారణను ఈనెల 18వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు సహా ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేల పై దాఖలైన అనర్హత పిటిషన్ల తో కలిపి కేసు విచారణ చేపట్టింది. స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గి తన వాదనలను వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని, వాదనలను వినిపించేందుకు తమకు రెండు మూడు రోజుల సమయం కావాలని రోహత్గి కోరగా, ఎమ్మెల్యేలు పార్టీ మారి 10 నెలలైందని, ఇంకెంత సమయం కావాలని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని స్పష్టం చేసింది.