Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2024, 4:15 pm Posted by : ramakrishna

వారు అంబేద్కర్ వారసులు ఎలా అవుతారు?

నిజామాబాద్, బతుకమ్మ: సామాజిక న్యాయాన్ని కోరుకోలేనివారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారసులు ఎలా అవుతారని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఆర్ నాంపల్లి ప్రశ్నించారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో ఉప వర్గీకరణ చేయొద్దని ఎక్కడా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింనద్నారు. బీసీల్లో ఏ, బీ, సీ, డీ ఉన్నట్లుగానే షెడ్యూల్డ్ కులాల్లో కూడా జనాభా ప్రాతిపదికన ఏ బీ సీ డీ కావాలని మందకృష్ణ మాదిగ  ఉద్యమం చేసి 2000 లో సాధించారని, కానీ కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టుకు వెళ్లి 2004 నవంబర్ 5న రద్దు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజున సుప్రీం తీర్పును గౌరవించాలని చెప్పిన వారు ఇప్పుడు ఎందుకు గౌరవించడం లేదని ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ 30  ఏళ్ల పోరాటం ఫలితం వర్గీకరణ సాధ్యమైందన్నారు. సమావేశంలో సల్లూరి శ్రీనివాస్, పోశెట్టి, గణేశ్, రవి, సాయిలు, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.