Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 1:46 pm Posted by : ramakrishna

పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలి

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి

ఖానాపూర్ శివారు లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ స్థలంలో జాతీయ జెండా జాతీయ జెండా ఆవిష్కరణ

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ పరిధిలోని  ఖానాపూర్ గ్రామ శివారులోని నూతన కలెక్టరేట్ భవనం వెనక నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను  శుక్రవారం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పరిశీలించారు. అక్కడే జాతీయ జెండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం సందర్శించినప్పుడు  ఆగస్టు 14 రాత్రి వరకు అధికారులకు సమయం ఇచ్చామన్నారు.  ఆగస్టు 15న 79 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గృహప్రవేశం నిర్వహిస్తామని  వెల్లడించామని పేర్కొన్నారు.  గురువారం జిల్లా కలెక్టర్, అధికారులు వచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి ఇళ్లకు సంబంధించిన మరమ్మతులు చేపడతామని,   అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పడం చాలా సంతోషకరమన్నారు.    ఖానాపూర్ గ్రామ శివారులో నిర్మించిన  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను, మండలాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ  చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.  లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఉద్యమం కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి సంతోష్ కుమార్ పద్మారావు చందు విజయ్ తదితరులు పాల్గొన్నారు.