Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 6:24 pm Posted by : ramakrishna

హోటల్ యజమానికి జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో పరిమిత సమయం దాటిన తర్వాత తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన వ్యాపారికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు. ఈనెల 22న గ్రాండ్ ప్లాజా హోటల్ యజమాని మాలపల్లి కి చెందిన మాక్సూద్ ఖాన్ పరిమిత సమయం దాటిన తమ వ్యాపారం కొనసాగించాడు. ఆయనను స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరు పరచగా రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం జైలుకు పంపినట్లు పేర్కొన్నారు.   ఎవరైనా వ్యాపార సమయం తరువాత షాప్ లు, హోటల్ లు, మరే ఇతర షాప్ లు తెరిచినచో వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.