Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 11:23 am Posted by : ramakrishna

పోలీస్ స్టేషన్ ఆవరణలో హోటల్ నిర్వాహకుడి ఆత్మహత్యాయత్నం

 

భీంగల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా భీంగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హోటల్ వ్యాపారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. భీంగల్ పట్టణ పరిధిలో పొలాస సుధాకర్ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో రాత్రివేళ నిర్ణీత సమయం గడిచిన తర్వాత హోటల్ తెరిచి ఉంచారని సుధాకర్ పై పోలీసులు ఈపెట్టి కేసు నమోదు చేశారు. సంబంధిత కేసును కోర్టులో పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. అయితే స్థానికంగా ఇతరులు అర్ధరాత్రి 12 గంటల వరకు హోటళ్ళను తెరిచి ఉంచిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనపై కావాలనే కేసు పెట్టి వేదిస్తున్నారని సుధాకర్ స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రలో పోసుకుని నిప్పంటించుకున్నారు.

Hotel manager attempts suicide at police station

అప్పటికే స్థానికులు సుధాకర్ ను మంటల నుంచి కాపాడేందుకు ప్రయత్నించగా సగం ఒళ్ళు కాలిపోయింది. విషయాన్ని చూసి అవక్కాయైన ఎస్సై అంబులెన్సుకు కాల్ చేసి తెప్పించి, చికిత్స నిమిత్తం క్షతగాత్రున్ని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు మాత్రం తమ తప్పేమి లేదని కేసు విషయంలో కోర్టుకు హాజరుకాకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపించారు.

Hotel manager attempts suicide at police station