Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:09 pm Posted by : ramakrishna

పోలీస్ స్టేషన్ అవరణలో చాయ్ వాలా ఆత్మహత్యాయత్నం

 

. . . కేసుల పేట్టి పోలిసులు వేదిస్తున్నారని ఓంటిపై పెట్రోల్ పోసుకుని అఘాయిత్యాం

 

భీంగల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా భీంగల్ పోలీస్ స్టేషన్ అవరణలో చిరు హోటల్ వ్యాపారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన సోమవారం ఉధయం జరిగింది. భీంగల్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో పొలాస సుధాకర్ అనే వ్యక్తి చాయ్ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో రాత్రివేళ నిర్ణీత సమయం గడిచిన తర్వాత హోటల్ తెరిచి ఉంచారని సుధాకర్ పై పోలీసులు ఈపెట్టి కేసు నమోదు చేశారు. అయితే స్థానికంగా ఇతరులు అర్ధరాత్రి 12 గంటల వరకు హోటళ్ళు , పాస్ట్ పుడ్ సెంటర్ లు, బిర్యాని పాయింట్ లు తెరిచి ఉంచిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనపై కావాలనే కేసు పెట్టి వేదిస్తున్నారని సుధాకర్ కుటుంబ సభ్యుల వద్ధ వాపోయారు. సోమవారం పోలిస్  స్టేషన్ కు రావాలని చెప్పడంతో అక్కడికి ఉదయం వెళ్లిన సుధాకర్ తనతో పాటు ప్లాస్టిక్ బాటిల్ లో తెచ్చుకున్న పెట్రోల్ ను పోలిస్ స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రలో పోసుకుని నిప్పంటించుకున్నారు.  పోట్రోల్ పోసుకున్న సుధాకర్ మంటలు తాళ లేక స్టేషన్ అవరణ అంతకలియ తిరిగి పోర్లాడాడు. స్థానికులు వెంటనే అక్కడ ఉన్న ఇసుక, మట్టిని చల్లి మంటలను అర్పారు. అప్పటికే స్థానికులు సుధాకర్ ను మంటల నుంచి కాపాడేందుకు ప్రయత్నించగా సగం ఒళ్ళు కాలిపోయింది. వెంటనే అంబులెన్సుకు కాల్ చేసి తెప్పించి, చికిత్స నిమిత్తం సుధాకర్ ను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

Hotel operator attempts suicide on police station premises
 . . . చిరు వ్యాపారి అత్మహత్యపై భగ్గుమన్న కుటుంబ సభ్యులు….

భీంగల్ పోలిసుల నిత్యం వేదింపులు భరించలేక ఓంటికి నిప్పంటించుకున్న సుధాకర్ విషయం తెలియడంతో బందువులు కుటుంబ సభ్యులు  పోలిస్ లు వైఖరిని నిరసిస్తు పోలిస్ స్టేషన్ ఎదుట బైటాయించారు. వారికి అఖిలపక్షం తోడు రావడంతో స్థానిక పోలిస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై దర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వీ వాంట్ జస్టిస్ అని డిమాండ్ చేస్తు నినాధాలు చేశారు. సుధాకర్ చాయ్ దుకాణం ఎదుట గల కిరణా వ్యాపారీ ద్వారా పోలిస్ లతో వేదింపులు తాళ లేకనే సుధాకర్ బలవన్మరణం యత్నం చేశారని ఆరోపించారు. పీటీ కేసులు పెట్టి వేదించడమే కాకుండా స్టేషన్ కు రావాలని నిత్యం వేదించారని వాపోయారు. సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుధాకర్ అత్మహత్యాయత్నానికి కారకులపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు కుటుంబ సభ్యులను, బంధవులను ఓప్పించి నిరసన విరమింపచేశారు.

Hotel operator attempts suicide on police station premises
 

. . .  భీంగల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన దానిలో పోలీసుల ఏమిలేదు : పోలీస్ కమీషనర్ సాయి చైతన్య

భీంగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక వ్యక్తి పెట్రోల్ బాటిల్ అగ్గిపెట్టె తీసుకొని వచ్చి తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అక్కడే ఉన్నటువంటి పోలీసు సిబ్బంది ,స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులు మంటలు ఆర్పి అతనిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించడం జరిగింది. అక్కడ ప్రాథమిక సమాచారం  ప్రకారం పోలస సుధాకర్ భీంగల్ నివాసి అతను పాత బస్టాండ్ భీంగల్ లో ఒక టీ స్టాల్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అతని షాప్ కు ఎదురుగా ఉన్నటువంటి ఒక కిరాణా షాప్ అతను నా దగ్గర సిగరెట్లు కొనడం లేదు అని అతని దగ్గరికి ఇద్దరు రిపోర్టర్లను పంపించి బెదిరించడం జరిగింది. అదేవిధంగా అర్థరాత్రి వరకు లో షాపు నడిపిస్తున్నాడని పోలీసు వారు డ్యూటీ లో భాగముగా అతనిపై ఈ పెట్టి కేసు వేయడం జరిగింది. రిపోర్టర్ బెదిరించిన  విషయాన్ని మనసులో పెట్టుకొని సుధాకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ వచ్చి ఆవరణలో నిప్పంటించుకోవడం జరిగింది. ఇట్టి విషయంలో పోలీసు వ్యవస్థకు గాని అతనికి గాని ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని తెలియజేస్తున్నాము.

Hotel operator attempts suicide on police station premises
  

. . . భీంగల్ ఎస్ఐ పై క్రిమినల్ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి

. . .   భీంగల్ బంద్ కు పిలుపు నిచ్చిన మాజీ మంత్రి, బాల్కోండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై తిరుపతి వేధింపులు తాళలేక నిరుపేద వెనుకబడిన తరగతికి చెందిన పొలాస సుధాకర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అత్యంత బాధాకరమని, దురదృష్టకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన టీస్టాల్ నడుపుకుంటూ జీవనం సాగించే ఒక సామాన్యున్ని పోలీసు అధికారి ప్రాణాల మీదికి తెచ్చే స్థాయికి వేధించడం గర్హనీయమని మండిపడ్డారు. భీమ్‌గల్ ఎస్సై తిరుపతి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయడం, అక్రమ ఇసుక వ్యాపారులతో చేతులు కలిపి దందాలు నడపడం, అమాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చితకబాది బూతులు తిడుతూ దౌర్జన్యాలు చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ అరాచకాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) దృష్టికి గతంలోనే పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మరింత బరితెగించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు పోలస సుధాకర్ ఆత్మహత్యయత్నం విషయంలో పోలీస్ లది ఎలాంటి ప్రమేయం లేదని  పోలిస్ కమీషనర్ మాట్లాడటం పూర్తిగా బాధ్యతరహిత్యం అని ఎమ్మెల్యే అన్నారు. బాధితుడు పోల సుధాకర్ హాస్పిటల్ లో మీడియాతో మాట్లాడుతూ భీంగల్ ఎస్ఐ తిరుపతి , కానిస్టేబుల్ లు ఇద్దరు తనను తరుచు వేదిస్తూ న్నారు అని అంత క్లియర్ గా చెప్పిన తరువాత కుడా సీపీ ఇందులో ఎస్. ఐ, పోలీసుల ప్రమేయం లేదు అనడం సీపీ బాధ్యత రాహిత్యమని నిరసనగా , వెంటనే ఎస్ఐ తిరుపతి పై కఠిన చర్యలు తీసుకోవాలని అతన్ని అరెస్ట్ చేసి ఉద్యోగం నుండి వెంటనే డిస్మిస్ చేయాలనీ డిమాండ్ చేస్తూ రేపు భీంగల్ బంద్ కి పిలుపునిచ్చారు.ఈ బంద్ కి భీంగల్ ప్రజలు, వ్యాపార వర్గాలు స్వచ్చదంగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

Hotel operator attempts suicide on police station premises