Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 12:40 pm Posted by : ramakrishna

గుండెపోటుతో హాస్టల్ విద్యార్థిని మృతి

 

. . ఎల్లారెడ్డి ఆసుపత్రి ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

 ఎల్లారెడ్డి, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా లో బీసీ బాలికల హాస్టల్ లో ఉండి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో చనిపోయిన. ఈ సంఘటన బుధవారం ఉదయం ఎల్లారెడ్డి ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం లొ వెలుగు చూసింది.  నసురుల్లాబాద్ మండలం హాజీపూర్ కు చెందిన చెందిన శ్రావణి (13) బుధవారం తెల్లవారు జామున తీవ్ర అస్వస్థతకు గురైంది. 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించే లోపు చనిపోయిందని వార్డెన్ తెలిపారు  బాలిక మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎల్లారెడ్డి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థి ని శ్రావణి మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Hostel student dies of heart attack

 

సంఘటనకు పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే.. .. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఎల్లారెడ్డి బిసీ హస్టల్ విద్యార్ధిని శ్రావాణి మరణానికి విద్యాశాఖా మంత్రి, సీయం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి.కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థను, గురుకులాలను, హాస్టళ్లను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తే కాంగ్రెస్ సర్కారు అడుగడుగునా నిర్వీర్యం చేసింది. ఉన్నత విద్యా ప్రమాణాలు కాలరాసి చివరికి కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టలేని దుస్థితి వల్ల అమాయక విద్యార్థులు బలవుతున్నారు. ఇప్పటికే 140 మందికి పైగా పిల్లలు సర్కారు నిర్వాకం వల్ల కనుమూసిన మానవత్వం లేని ముఖ్యమంత్రి లో కనీస చలనం లేదు. విద్యార్థి ని శ్రావణి మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి 25 లక్షల పరిహారం అందించే అన్ని విధాలా ఆదుకోవాలని  మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు.

 

Hostel student dies of heart attack
Hostel student dies of heart attack