Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2025, 5:15 pm Posted by : ramakrishna

తెలంగాణ యూనివర్సిటీలో హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలి

  • తేయూ పి డి ఎస్ యూ నాయకుడు కే.గౌతం రాజ్

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టల్స్ సమస్యలు పరిష్కరించాలని యూనివర్సిటీ పి డి ఎస్ యూ నాయకుడు కే.గౌతం రాజ్ డిమాండ్ చేశారు. పి డి ఎస్ యూ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ హాస్టల్స్ లో చాలామంది విద్యార్థులకు దోమలు కుట్టడంతో ఎర్రటి దద్దుర్లు, ఎలర్జీ వస్తున్నాయని,  దోమల బెడదను ఆరికట్టడానికి కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా రెండు రోజులకు ఒకసారి స్ప్రే చేయాలని , హాస్టల్స్ చుట్టూ చెత్త పేరుకుపోవడం వలన అపరిశుభ్రంగా ఉందని వెంటనే క్లీన్ చేపియాలని, హాస్టల్ చుట్టూ మురుగునీటి పైపులు మూసుకోపోయాయని మురుగునీరు లీకేజీ అయ్యి దుర్వాసన వస్తుందని వెంటనే మరమ్మతులు చేయాలని అన్నారు.  సెక్యూరిటీ గాడ్స్ కి టార్చ్ లైట్ లు లేకపోవడం వలన తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించలేకపోతున్నారని సమర్థవంతమైన ఫోకస్ వచ్చే టార్చ్ లైట్లను అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని యెడల ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తే. యూ పి డి ఎస్ యూ నాయకులు హుస్సేన్,ఆకాష్, భూమేష్,విజయ్, తదితరులు పాల్గొన్నారు.