నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నాగమోహన్ ని ఆయుష్ విభాగం తరపున శనివారం సన్మానించారు. ఆయుష్ విభాగం టీం ఆధ్వర్యంలో శాలువ, ఔషధ మొక్క తో సన్మానించినట్టు జిల్లా ఆయుష్ శాఖ ఇన్ చార్జి డాక్టర్ జె.గంగా దాస్ తెలిపారు. అనంతరం సూపరిండెంట్ కి అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో యోగ వైద్యులు డాక్టర్ తిరుపతి, ఆయుష్ విభాగం ఫార్మా సిస్ట్ లు న్యవానంది పురుషోత్తం, ఉమా ప్రసాద్, నీరజ, పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి పాల్గొన్నారు.