. . . తుఫాన్ కార్ , ఆటో డి
.. అన్న మృతి.. తమ్ముడికి గాయాలు
బాన్సువాడ, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం, ఆటో పరస్పరం డికోట్టుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం గాలి పూర్ గేట్ ప్రధాన రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. నిజాంసాగర్ వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం, హైదరాబాద్ నుంచి బాన్సువాడ కు వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాన్సువాడ కు చెందిన ఆటో డ్రైవర్ హుస్సేనీ అక్కడికక్కడే మృతి చెందాడు.ఆటోలో హుస్సేనీతో పాటు ప్రయాణిస్తున్న అతని సోదరుడు అబ్బుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హుస్సేనీ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ ర్యాపిడో సేవలు అందించేవాడు. ఆదివారం సెలవు కావడంతో భార్య, పిల్లలను చూసేందుకు హైదరాబాద్ నుంచి బాన్సువాడ కు వస్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులను కలిసేందుకు వస్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బాన్సువాడ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజాం సాగర్ పోలిసులు కేసు నమోదు చేసి డేడ్ బాడిని పోస్టు మార్టం కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.
