బదిలీ అయిన కానిస్టేబుళ్లకు సన్మానం
బతుకమ్మ,ఏర్గట్ల: పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్ళుతున్న ముగ్గురు కానిస్టేబుళ్లు గంగాధర్, హరికృష్ణ, రామును ఎస్సై రాము తమ సిబ్బంది తో కలిసి ఆదివారం శాలువాతో సన్మానించి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు సర్వ సాధారణమని తాము ఎక్కడ విధులు నిర్వహించిన ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఎల్లవేళలా సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయినప్పటి నుండి ఆక్కడే విధులు నిర్వహించిన గంగాధర్ ను ప్రత్యేకంగా పోలీస్...