Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 6:44 pm Posted by : ramakrishna

సుద్దులం గ్రామ నూతన వార్డు మెంబర్లకు సన్మానం

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

సుద్దులం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన వార్డ్ మెంబర్స్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు . నగరంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం  సుద్దులం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఎమ్మెల్యే భూపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం గెలుపొందిన వార్డు మెంబర్లకు ఎమ్మెల్యే స్వయంగా శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ.. గెలుపొందిన వార్డు మెంబర్లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని పిలుపునిచ్చారు.ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల ఆదరణ పొందిందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని పేర్కొంటూ, రానున్న ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుద్దులం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నర్సాగౌడ్,బాలకృష్ణ, అనిల్,ఉప సర్పంచ్ నరేష్,వార్డ్ మెంబర్ లు దొడ లక్ష్మి, లక్కం మనోజ్ రెడ్డి,హారిక, సంతోష్ రెడ్డి, భూషణ్ రెడ్డి, వాల్గొట్ లక్ష్మి తదితరులు ఉన్నారు.

Honors for new ward members of Suddulam village