ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని మల్లాయిపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ప్రవీణ్, గులాం షాకీర్ ఉపాధ్యాయులను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విశ్వనాథం, ఉపాధ్యాయులు సంతోష్, మాజీ సర్పంచ్ ఎల్లన్న, కార్యదర్శి రాజు, గ్రామ పెద్దలు వెంకటేశం, యూత్ సభ్యులు దత్తు, గ్రామస్తులు, కారోబార్ రాజశేఖర్, గ్రామపంచాయతీ సబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.