Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2024, 5:36 pm Posted by : ramakrishna

పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఎంఈఓ కు సన్మానం

బతుకమ్మ, ఏర్గట్ల: ప్రతీ మండలానికి ఒక విద్యాశాఖ అధికారిని నియమించిన సందర్భంగా నూతన ఏర్గట్ల మండల విద్యాశాఖ అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆనంద్ రావ్ కు పి ఆర్ టి యు ఏర్గట్ల మండల శాఖ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగిందని అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ తెలిపారు. మండలానికి సంబంధించిన విద్యాపరమైన సమస్యల పై విద్యాశాఖ అధికారికి పి ఆర్ టి యు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గటాడి భాస్కర్, జిల్లా కార్యదర్శి సాదుల గంగాధర్, మండల అసోసియేట్ అధ్యక్షులు మైసాల సుధాకర్, మండల మహిళ ఉపాధ్యక్షురాలు మమత, మండల కార్యదర్శి సురేష్,  ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.