బీసీటీయూ ఆధ్వర్యంలో డీఈఓకు సన్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని విద్యాశాఖ కార్యాలయంలో నూతన డిఈవో గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ ను బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శాలువా తో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ మన జిల్లావాసి మనకు డిఇవో గా రావడం అభినందనీయమని అన్నారు. కుల గణన విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. పదో తరగతి ఫలితాలలో జిల్లా ను రాష్ట్రం లో ప్రథమ...