నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ సభ్యుడిగా నియమితులైన జి రామకృష్ణ ను ఐ ఎన్ టీ యూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్ కొనసాగుతున్న రామకృష్ణ పార్టీ పటిష్టతకు ఎంతో శ్రమించారని నాయకులు కొనియాడారు. రామకృష్ణ నియమానికి కృషి చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎడ్ల నాగరాజ్, పూజారి గంగాధర్, రాంభూపాల్, హరిబాబు, ప్రమోద్, భూషణ్, మనోహర్, రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.