బాలుడి మర్డర్ కేసు నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేసిన బృందానికి సన్మానం
హైదరాబాద్, బతుకమ్మ: సనత్‌నగర్ బాలుడి దారుణ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా పకడ్బందీగా ఆధారాలు సేకరించి, కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పోలీస్, ప్రాసిక్యూషన్ బృందాన్ని హైదారబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సన్మానించారు. ఈ శిక్ష ఖరారులో కీలక పాత్ర పోషించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వి. రామకృష్ణారావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముత్తు యాదవ్, సనత్ నగర్ ఎస్‌హెచ్‌ఓ అశోక్, ఎస్‌ఐ అబ్దుల్ హయ్యుమ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ శేఖర్‌లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. నేరస్థులు ఎంతటి వారైనా చట్టం నుంచి...