మోర్తాడ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి సన్మానం
మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఎన్నికలలో అధ్యక్షుడిగా గెలుపొందిన బి.సాయన్న ను మండలంలోని దళిత సంక్షేమ సంఘం, అంబేడ్కర్ యువజన సంఘం, ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం సంయుక్తంగా ఘనంగా సన్మానించారు. శనివారం మోర్తాడ్ ఫూలే విగ్రహం సాక్షిగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏవైఎస్ మండల అధ్యక్షులు అంగుళి మాలజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పాత్రికేయులకు కనీస సౌకర్యాలు సమకూర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో పాత్రికేయులకు ...