Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2025, 10:07 pm Posted by : ramakrishna

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడికి ఘనంగా సన్మానం

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షునిగా పుల్లెన్ విట్టల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తో బిచ్కుంద మున్నూరు కాపు కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ కిషోర్ ఇంట్లో నూతన అధ్యక్షుడికి పూలదండలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కుల పెద్దలు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కులస్తులు ధర్పల్ గంగాధర్, సాయిని పండరి, బుల్లి శంకర్, మద్దూర్ నాగనాథ్, మాజీ ఎంపిటిసి పవర్ సురేష్, బొమ్మల లక్ష్మణ్, పోతుల అశోక్, హాజీ బాల్రాజ్, పోతులా అనిల్, నారం లింగురాం, చింతల శ్రీనివాస్, మైనారిటి సీనియర్ నాయకులు షేక్ పాషా సెట్,పుల్లెన్ వెంకటి, మెరుగు బాల్రాజ్, బాస సాయిలు మరియు ఇతర మున్నూరు కాపు కులస్తులు పాల్గొన్నారు.

Honored for the President of Munnur Kapu Sangam