Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2025, 4:42 pm Posted by : ramakrishna

మండల టాపర్ కు సన్మానం

బతుకమ్మ, ఏర్గట్ల:  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  ఏర్గట్ల లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో ఏర్గట్ల మండల టాపర్ గా నిలిచిన విద్యార్థిని ఆస్నిహ భాను కి గోర్దీశ్వర సంస్థ వాళ్లు 5000/ రూపాయల నగదు బహుమతిని అందించడం జరిగింది. మధ్యాహ్నం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ నగదు బహుమతిని సంస్థ అధ్యక్షులు తిరుపతి రెడ్డి సభ్యులు వెంకటేష్, నాజర్,చేతుల మీదుగా విద్యార్థిని తల్లి కి ఈ బహుమతిని అందించడం జరిగింది.సంస్థ అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ చదువులో రాణించినప్పుడు గొప్ప అవకాశాలు వస్తాయని గొప్ప పేరు లభిస్తుందని, ఇలాంటి సంస్థల ఆధ్వర్యం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని,అందుకే ప్రతి ఒక్క విద్యార్థి చదువుపై చక్కని దృష్టి పెట్టి మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణా చారి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.