ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఎంపికైన విద్యార్థికి సన్మానం

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం పాలెం గ్రామం నుంచి ఎన్ ఎం ఎం ఎస్ పరీక్షలో ఎంపికైన పులి రామ్ చరణ్ అనే విద్యార్థిని శుక్రవారం ఎమ్మార్వో కృష్ణ శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వివిధ మౌలిక వసతులు కల్పిస్తూ, నాణ్యమైన విద్యను అందించడానికి ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు , డిజిటల్ విద్య అందిస్తూన్నారని తెలియజేశారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు...