యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానం
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. గ్రామంలో గల మల్లన్న గుడికి నిధులు మంజూరు చేసినందుకుగాను సునిల్ రెడ్డికి మర్యాదపూర్వకంగా ధన్యవాదములు తెలపడం జరిగింది. ఆదివారం మల్లన్న గుడి భూమి పూజకు ఆయనను ఆహ్వానించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దేవేందర్, మహేష్, అనిల్ యాదవ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.