నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ కె రవీందర్ రెడ్డిని సోషల్ సైన్స్ డీన్ గా వైస్ ఛాన్స్లర్ ప్రొ టి యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్టర్ ప్రొ ఎం యాదగిరి నియామకపు ఉత్తర్వులు అందించిన సందర్భంగా అర్థశాస్త్ర విభాగాధిపతి డా. ఎ. పున్నయ్య ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆచార్య కే రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ సైన్సెస్ లో సామాజిక చలనాంకాలను అనుసరించి నాణ్యమైన అనువర్తనీయమైన పరిశోధనల పెంపుకు దృష్టి సారిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బి ఓ ఎస్ డా టి సంపత్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పాత నాగరాజు, డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, డాక్టర్ వి దత్తాహరి విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.