నూతన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం

  బోధన్, బతుకమ్మ :   బోధన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ విట్టల్ అధ్యక్షత వహించారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనపై సర్పంచ్‌లు ప్రత్యేక దృష్టి సారించాలని తహసీల్దార్ సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను “మన ఇసుక – మన వాహనం” పథకం ద్వారా సులభంగా పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగయ్య, ఎంపీడీవో కిషోర్, ఎంపీవో అధికారులు పాల్గొన్నారు. అనంతరం...