Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 7:42 pm Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు సన్మానం

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మద్ది చంద్ర కాంత్ రెడ్డిని బుధవారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి ఎల్లారెడ్డి గ్రంధాలయానికి వచ్చిన సందర్భంగా సన్మానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పిఎసిఎస్ డైరెక్టర్ నాగం గోపికృష్ణ, మాజీ సర్పంచ్ పప్పు వెంకటేశం, పట్టణ యూత్ ఉపాధ్యక్షులు ప్రకాష్, కో ఆప్షన్ సభ్యులు లింగం, ముజీబ్ ,సీనియర్ నాయకులు రఫిక్, మాజీ జెడ్పిటిసి గాయాజుద్దీన్, మహేష్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Honor to the Chairman of Kamareddy District Library