నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల 2023-24 విద్యా సంవత్సరంలో జాతీయ స్థాయిలో జరిగిన నీట్ పరీక్షలో ర్యాంకులు సాధించి వివిధ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను సాధించిన ఎస్ఆర్ విద్యార్థులను సన్మానించారు. నిజామాబాద్ ఎస్ఆర్ జూనియర్ కాలేజికి సంబంధించిన 8 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన కట్ల సహాయ, కట్ల సహాజ, బాశెట్టి సన్నిహిత్, వడ్డె అర్చన, బాగుల తనుజ, దావానే సమైఖ్య, చితారి అక్షయ, జెట్టి సుదీప్తిలు ఉన్నారు. ఈ విద్యార్థులను ఎస్ఆర్ డీజీఎం గోవర్ధన్ రెడ్డి, జోనల్ ఇంచార్జి శ్రీకాంత్, డీన్ ప్రదీప్, క్యాంపస్ ప్రిన్సిపాల్ హన్మంత్ రావు, దేవేందర్ రెడ్డి, నర్సింహ రెడ్డిలు సన్మానించారు. ఈ సందర్భంగా డీజీఎం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ బ్రాంచ్ కు చెందిన 8 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ కు దీటుగా నిజామాబాద్ లోనూ విద్యార్థులు జాతీయ స్థాయి ఎంట్రెన్స్ లో ర్యాంకులు సాధించి మెడికల్ సీట్లు పొందిన వారు గ్రామీణప్రాంత విద్యార్థులు కావడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా జోనల్ ఇంచార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ నీట్ లో ఉత్తమ ర్యాంకు సాధించడానికి సీనియర్ లెక్చరర్లు, బెస్ట్ మెటీరియల్ కారణమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.