నవీపేట్, బతుకమ్మ : నిజామాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రాంచందర్ ను ఆయన స్వగ్రామంలో బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా హన్మాండ్లు మాట్లాడుతూ.. మారుమూల గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం, రైతు బిడ్డకు పదవి ఇవ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాలేశ్వర్ మాజీ సర్పంచ్ సరిన్, నవీన్, రమేశ్, కుమ్మరి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.