Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2024, 3:33 pm Posted by : ramakrishna

సెలవు సరే.. ఇన్ చార్జి ఎవరు?

. పెద్ద దిక్కులేని  మాక్లూర్ మండల పరిషత్

. కుంటుపడిన పాలన

బతుకమ్మ, మాక్లూర్ :  మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయ పాలన గత పది రోజులుగా అధికారి లేకుండానే కొనసాగుతోంది. వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టిన అధికారి స్థానంలో మరొకరికి ఇన్ చార్జి ఇవ్వకపోవడంతో ఏ  అధికారి సూచన మేరకు విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.  సెలవులో వెళ్తే మరొకరికి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాల్సి ఉన్నా అవేవీ పట్టించుకోవడం లేదు. జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్న సమయంలో అధికారులు సెలవులు రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఓ మండలానికి అధికారి లేకపోవడం గమనార్హం.