Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 6:49 pm Posted by : ramakrishna

11న ఎన్నికలు జరిగే ప్రాంతాలలో అన్ని రంగాల లోని సంస్థలకు సెలవు

 

నిజామాబాద్, బతుకమ్మ :

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి విడతగా ఈ నెల 11న పోలింగ్ జరుగనున్న మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశ ఎన్నికలు నిర్వహించ నున్న బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, పరిశ్రమలకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రైవేట్ వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు వారి వద్ద పని చేసే ఉద్యోగులు, సిబ్బందికి ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన వెసులుబాటు కల్పిస్తూ అనుమతిన్చాలన్నారు. కాగా, ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్న విద్యా సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు ఈ నెల 10, 11వ తేదీలలో రెండు రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.