Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 4:48 pm Posted by : ramakrishna

హిందూ పండగలలో అత్యంత విశిష్టమైన పండగ హోలీ

 

. . . చిన్న పెద్ద అనే తేడా లేకుండా సంతోషంగా నిర్వహించే ఒకే ఒక్క పండగ హోళి పండగ..

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హిందూ పండగలు ఎన్ని ఉన్నప్పటికీ దేని విశిష్టత దానికే ఉంటుందని అందులో ముఖ్యంగా హోలీ పండగ కు ప్రత్యేక స్థానం ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కామ దహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నగర ప్రజలు సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. మంగళవారం రోజున చంద్రగ్రహణం ఉండటం వల్ల కామ దహన కార్యక్రమాన్ని ప్రజలు సోమవారం రోజునే నిర్వహించుకుంటున్నారని కానీ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు ఒక రోజు ముందుగానే నిర్వహిస్తారని ఆయన తెలిపారు. హోలీ పండగకు ప్రత్యేక స్థానం ఉందని, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఐక్యంగా ఈ పండగను ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారులకు హోలీ పండగ అంటే ఎంతో ఇష్టమని ఆయనన్నారు. రంగులు ఆడేటప్పుడు చిన్నారులు జాగ్రత్త వహించాలని వారి తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలను గమనించాలని కోరారు. ఈ హోలీ పండగను ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు ప్రతీ సంవత్సరం కామ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారని ఇందులో తాను కూడా హాజరవుతానని ఆనందం వ్యక్తం చేశారు.

 

Holi is the most important Hindu festival.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇందూరు ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ చైర్ పర్సన్ ముక్కా దేవేందర్ గుప్తా, పాల్దే లక్ష్మీకాంతం, ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్, కమిటీ సభ్యులు, మహిళా సంఘం కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంస్థల, గల్లీ సంఘాల అధ్యక, కార్యదర్శులు, పట్టణ ఆర్యవైశ్య సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Holi is the most important Hindu festival.