Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2025, 5:50 pm Posted by : ramakrishna

సాంప్రదాయబద్ధంగా హోలీ సంబరాలు

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ గ్రామంలో ఎస్ ఎస్ సి (1992) బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు హోలీ పండుగను గత 14 సంవత్సరాలుగా సాంప్రదాయ బద్ధంగా సహజమైన రంగులను వాడుతూ, ఏకరూప దస్తులు ధరించి సాంప్రదాయబద్ధంగా హోలీ ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్లు యువకులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా సంప్రదాయబద్ధంగా హోళీ ఉత్సవాన్ని జరుపుకోవాలన్నారు. చెడు  అలవాట్లను మాని గుడ్లను కొట్టే సంస్కృతిని విడనాడి, రసాయనరంగులను ఇతరత్రా చేయకుండా  పండుగను  సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.