Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2024, 12:44 pm Posted by : ramakrishna

స్కూల్ కు నడిచివస్తోందని విద్యార్థినికి సైకిల్ కొనిచ్చిన హెచ్ ఎం

మోర్తాడ్, బతుకమ్మ: రెండు కిలోమీటర్ల దూరం నుంచి ప్రతిరోజూ పాఠశాలకు నడిచివస్తోన్న విద్యార్థినికి హెచ్ఎం సైకిల్ కొనిచ్చి తన ఉదారతను చాటుకున్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకెట్ జడ్పీహెచ్ ఎస్ లో ఏడో తరగతి చదువుతున్న బేల్దారి ధనలక్ష్యి సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచి పాఠశాలకు నడిచివస్తోంది. మోర్తాడ్ మండలంలోని సుంకెట్ గ్రామంలో గల జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో బేల్దారి ధనలక్ష్మి ఏడవ తరగతి చదువుతోంది. సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుండి ప్రతిరోజు నడుచుకుంటూ విద్యార్థి పాఠశాలకు వస్తున్న విషయాన్ని గమనించిన పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ ఆమెకు నూతన సైకిల్ ను  బహూకరించాడు. ధనలక్ష్మిది పేద కుటుంబం కావడం, ఆమె ప్రతిరోజూ నడిచి వస్తుండడాన్ని గమనించిన హెచ్ఎం సైకిల్ కొనివ్వడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.