అవగాహనతోనే హెచ్ఐవి దూరం
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే మనం ఈ వ్యాధిని దూరం చేయడానికి అవకాశం ఉంటుందని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. వరల్డ్ ఎయిడ్స్ డే 2024 సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి తదనంతరం కలెక్టరేట్ లో గల కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు....