- పలు అభివృద్ధి పనులకు కృషి చేస్తున్న మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని (గౌరారం)లింగాపూర్ గ్రామంలో ఎనిమిదవ వార్డులో పలు సమస్యలు ఉండడంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు,వార్డు సభ్యులు గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి,మాజీ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి లను కలిసి కొత్త బోరు,మిషన్ భగీరథ పైపు కావాలని కోరారు. దీంతో స్పందించిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి,మాజీ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మిలు వెంబడే గ్రామంలో కొత్త బోర్ వేయించి,,మిషన్ భగీరథ పైపు సుమారు నాలుగు వందల మీటర్లు తమ స్వంత డబ్బులతో పెట్టుబడి పెట్టి గ్రామంలో ఉన్న సమస్యలను తీర్చారు. దీంతో గ్రామంలో ఏ ఆపడవచ్చిన ముందుండే ఆపద్బాంధవుడనీ పేరుంది,అనంతర మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అంటే గ్రామం బాగుకోరునవారే నిజమైన ప్రజా ప్రతినిధులు అన్నారు. కొందరు అక్రమాలు, బెదిరింపులు, అక్రమ సంపాదనే లక్ష్యంగా దోచుకునేందుకే స్వార్థంతో గ్రామస్తులను, గ్రామాన్ని బ్రస్టు పట్టించడానికే ప్రయత్నిస్తున్నారని అన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల కొరకు కాళేశ్వరం నుండి ఇసుకను తీసుకొచ్చి రోడ్లు వేయడం జరిగిందన్నారు. అనంతరం మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి మాజీ సర్పంచ్ లక్ష్మి లకు గ్రామ విడిసి తరపున కృతజ్ఞతలు తెలిపారు.
