Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 1:02 pm Posted by : ramakrishna

హిందువులు ఓటు బ్యాంకుగా మారాలి

హైదరాబాద్, బతుకమ్మ :   హిందువులు ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆదివారం కూకట్ పల్లిలో నిర్వహించిన కాపు కులస్తుల కార్తీక వన భోజనాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందన్నారు. అక్కడ ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన వారంతా ఘర్ వాపసీ రావాలని కోరారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మ ప్రచారంతో ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునారాలోచన వస్తుందన్నారు. హిందూ సనాతన ధర్మపరిరక్షణే తన లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు.