Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 9:19 pm Posted by : ramakrishna

హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

సమాజ శ్రేయస్సు కోసం.. సనాతన ధర్మం కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని, హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలని ఆర్ఎస్ఎస్ డాక్టర్ వారి దస్తగిరి, శ్రీధర్.జి అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సాలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో శనివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హిందూ యువశక్తి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో కోటగిరి, పోతంగల్, రుద్రూర్ మండలాలకు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్ఎస్ఎస్ డాక్టర్ వారి దస్తగిరి, శ్రీధర్.జి మాట్లాడుతూ.. హిందూ ధర్మం కోసం అప్పట్లోనే విదేశీయులతో పోరాడారనీ, పురానాలు, ఇతిహాసాలు, సాంప్రదాయాల ప్రారంభంతో సనాతన ధర్మం ప్రారంభమైందని, ఈ ధర్మం ప్రతిరూపమే హిందూ సమ్మేళనమని అన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం పాటించినప్పుడే ధర్మం నడుస్తుందన్నారు. అదే విధంగా సమాజ సేవ, జాతీయ సమైక్యత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం వంటి విలువలను యువతలో పెంపొందించేందుకు ఈ సమ్మేళనం వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

 

Hindus must move forward in unity.