Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2024, 11:47 am Posted by : ramakrishna

హిందూ దేవాలయాల జోలికొస్తే సహించం

రుద్రూర్  బంద్

రుద్రూర్, బతుకమ్మ:

హైదరాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయంలో గల ముత్యాలమ్మ విగ్రహాన్ని, పలు హిందూ దేవాలయాల పై కొంత మంది దుండగులు దాడులు చేసి, విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హిందూసంఘాలు, విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్, హిందూ వాహిని ఆధ్వర్యంలో రూద్రుర్ లో బంద్ నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గురువారం జేయన్సీ కాలనీలో గల హనుమాన్ మందిరం నుండి అంగడి బజార్ లోని గణపతి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలో దుకాణ సముదాయలు, వ్యాపార సముదాయలు, వాణిజ్య సముదాయలు స్వచ్ఛందంగా శాంతియుతంగా బంద్ పాటించారు. ఈ సందర్బంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. హిందూ దేవాలయాల జోలికొస్తే సహించేది లేదని హేచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాబాయి కి వినతిపత్రం అందజేశారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తూ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పార్వతి మురళి, ప్రశాంత్ గౌడ్, హరికృష్ణ, శ్రీకాంత్ గౌడ్, కటికే రామ్ రాజ్, నిఖిల్, రాజు, వివిధ మండలాల హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Hindu temples are not tolerated